Asianet News TeluguAsianet News Telugu

సింగరేణి బొగ్గు గనుల్లో ఘనంగా మే డే వేడుకలు

మేడే వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై ఘనంగా నిర్వహించారు. 

మేడే వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ బొగ్గు గనులపై ఘనంగా నిర్వహించారు. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అరుణ పతాకాలు రెపరెపలాడాయి. ఓపెన్ కాస్ట్ ఐదవ  ప్రాజెక్టుపై జరిగిన మేడే వేడుకలలో జాతీయ కార్మిక సంఘాల నేతలు పాల్గొని ఎర్రజెండాలను ఎగురవేశారు. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా వివిధ కార్మిక సంఘాల నాయకులతో కలిసి మే డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.