పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి... తృటిలో తప్పించుకున్న మరో ఆరుగురు

పిడుగుపాటుతో గొర్ల కాపరి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో జరిగింది. 

| Updated : May 01 2023, 01:19 PM
Share this Video

పిడుగుపాటుతో గొర్ల కాపరి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన జంగం కొమురయ్య (48) సాయంత్రం కురిసిన ఆకాల వర్షానికి పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెన్నంపల్లి గ్రామానికి చెందిన జంగం కొమరయ్యతో పాటు మరో ఆరుగురు గొర్ల కాపర్లు గొర్ల మేత కోసమే మంగపేట గ్రామ శివారులో గొర్లు కాస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగు పడటంతో కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితోపాటు గొర్రె మేపుతున్న మరో ఆరుగురికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.

Read More

Related Video