లాక్ డౌన్ చిత్రాలు : జనావాసాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న చిరుతపులి

లాక్ డౌన్ మనుషుల్ని బోన్లలో కట్టిపడేస్తే వన్యప్రాణులకు స్వేచ్ఛను ప్రసాదించింది.

First Published Apr 21, 2020, 10:38 AM IST | Last Updated Apr 21, 2020, 2:43 PM IST

లాక్ డౌన్ మనుషుల్ని బోన్లలో కట్టిపడేస్తే వన్యప్రాణులకు స్వేచ్ఛను ప్రసాదించింది. మనిషనే మృగం కనిపించకపోవడంతో కాంక్రీట్ జంగిల్ లోనూ అవి నిశ్చింతగా తిరుగుతున్నాయి. తాజాగా  ఓ చిరుత రోడ్డు దాటుతూ సిసి కెమెరా కంటికి చిక్కింది, అయితే ఈ వీడియో కేబీఆర్ పార్క్ దగ్గరిదని పుకార్లు వచ్చాయి. అలాగే వీడియో వైరల్ అయింది. మరికొందరు తిరుపతిలోది అని కూడా అంటున్నారు. అయితే మూడు రోజుల కిందట జరిగిందిగా చెబుతున్న ఈ వీడియో కేబీఆర్ పార్కు ది కాదని తెలంగాణ ప్రభుత్వం  ధృవీకరించింది. ఏదేమైనా ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read More...