పైలట్ మొగుడి పైశాచికం.. లేడీ టెక్కీని చిదిమేసిన వైనం....(వీడియో)
అతను పైలెట్.. ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. అందమైన జీవితం.. కానీ వాడి మనసులో విషపు పురుగు తొలిచింది.
అతను పైలెట్.. ఆమె సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. అందమైన జీవితం.. కానీ వాడి మనసులో విషపు పురుగు తొలిచింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. వేరే స్త్రీలతో సంబంధం పెట్టుకోవడం అడిగితే చచ్చేలా కొట్టడం.. ఇవీ శంషాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న లావణ్య లహరి జీవితంలోని విస్తుపోయే నిజాలు. లావణ్య సూసైడ్ అనంతరం ఇంట్లో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు ఓ షాకింగ్ వీడియో దొరికింది. మరోవైపు లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడు వెంకటేశం తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని లావణ్య తండ్రి ఈశ్వరయ్య ఆరోపిస్తున్నారు.