Asianet News TeluguAsianet News Telugu

విషాదం... ఎంసెట్ ర్యాంకర్ ప్రాణాలు బలితీసుకున్న లోన్ యాప్ వేధింపులు

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు మరీ మతిమీరిపోతున్నాయి. ఇప్పటికే ఈ వేధింపులు భరించలేక తెలంగాణతో పాటు ఏపీలోనూ పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

First Published Sep 24, 2022, 5:10 PM IST | Last Updated Sep 24, 2022, 5:10 PM IST

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్ వేధింపులు మరీ మతిమీరిపోతున్నాయి. ఇప్పటికే ఈ వేధింపులు భరించలేక తెలంగాణతో పాటు ఏపీలోనూ పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా మరో యువకుడు ఈ వేధింపులకు బలయ్యాడు. కేవలం పదివేల రూపాయలు రుణంగా ఇచ్చి 45వేల వరకు కట్టించుకున్నా రుణ యాప్స్ ధనదాహం తీరలేదు. ఇంకా డబ్బులు కట్టాలని వేధించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా నంగునూరుకు చెందిన శ్రీధర్-పద్మ దంపతుల కొడుకు ముని సాయి (19) చదువులో మంచి చురుకైన విద్యార్థి. ఇటీవలే ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ రాయగా 2000 ర్యాంక్ వచ్చింది. దీంతో మంచి కాలేజీలో సీటు వస్తుందని ఎంతో ఆనందంగా వున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ఓ ఆన్ లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న సాయి భారీ వడ్డీతో సహా డబ్బులు తిరిగి చెల్లించినా వేధింపులు కొనసాగాయి. మరిన్ని డబ్బులు కట్టాలని వేధిస్తుండటంతో భయపడిపోయిన సాయి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.