Asianet News TeluguAsianet News Telugu

పట్టణ ప్రగతి కోసం... అధికారులను పరుగులు పెట్టించిన కరీంనగర్ కలెక్టర్

Feb 27, 2020, 4:21 PM IST

పట్టణ ప్రగతిలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పలు వార్డులలో జరుగుతున్న పనులను కలెక్టర్ శశాంక తో పాటు మున్సిపల్ చైర్మన్, కమిషనర్, అధికారులు మరియు కమిటీ మెంబర్లు పర్యవేకించారు. ఈ క్రమంలో స్థానిక అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు .అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు చురుకుగా పాల్గొంటున్నారని ప్రశంసించారు. ప్రజలు కూడా బాధ్యత గా చెత్త, మురుగు  నీరు నిల్వ లేకుండా చేసుకొంటూ అధికారులకు సహకరించాల్సిందిగా కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించుకొని పట్టణ ప్రగతి అభివృద్ధి కి తోడ్పడాలి అన్నారు.

Video Top Stories