International Yoga Day 2022 : యోగాసనాలు వేసిన మంత్రులు హరీష్, శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Share this Video

హైదరాబాద్: తెలంగాణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో యోగా వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇలా 
సిద్ధిపేటలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని స్వయంగా యోగాసనాలు వేసారు. అనంతరం మంత్రి హరీష్ యోగా ప్రత్యేకత గురించి అందరికీ వివరించారు.

ఇక మహబూబ్ నగర్ జిల్లా నెహ్రూ యువ కేంద్ర మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో జరిగిన యోగా డే కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మహబూబ్ నగర్ రాయల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కూడా యోగాసనాలు వేసారు. 

Related Video