హైదరాబాద్ లో భారత స్వతంత్ర వజ్రోత్సవాలు... మంత్రి తలసాని త్రివర్ణ పతాకాల పంపిణీ
హైదరాబాద్ : 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.
హైదరాబాద్ : 75 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా భారత స్వతంత్ర వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఆగస్టు 8న సీఎం కేసీఆర్ చేతులమీదుగా హైదరాబాద్ లో ప్రారంభమైన ఈ వజ్రోత్సవ వేడుకలు ఈ నెల 22 వరకు (15 రోజులు) రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాల పంపిణీ చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీలో మూడు రంగుల బెలూన్లను గాల్లో ఎగరేసి జాతీయ పతాకాలను పంపిణీని ప్రారంభించారు మంత్రి. అనంతరం మంత్రి తలసాని జెండా ఊపి 3k రన్ ను ప్రారంభించారు.