జగిత్యాల బంద్ తో నాకు ఎలాంటి సంబంధంలేదు ... ఎస్ఐ అనిల్
న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది.నా విషయంలో ఎవరు రాద్దాంతం చేయద్దు అని ఎస్సై అనిల్ వీడియో సందేశం ఇచ్చారు.
న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది.నా విషయంలో ఎవరు రాద్దాంతం చేయద్దు అని ఎస్సై అనిల్ వీడియో సందేశం ఇచ్చారు. జగిత్యాల రూరల్ ఎస్సై గా పనిచేసిన అనీల్ గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో జరిగిన గొడవ వ్యవహారంలో సస్పెండ్ కాగా కొన్ని రాజకీయ పార్టీలు,కొన్ని సంఘాలు, సంస్థలు అనిల్ ఎస్సై కి మద్దతుగా ఎస్సై సస్పెన్షన్ రద్దు చేయాలని శనివారం జగిత్యాల బందుకు పిలుపునివ్వగా ఇది తెలిసిన ఎస్సై అనిల్ తనకు ఆ బందుకు ఎలాంటి సంబంధం లేదని కొందరు రాజకీయ స్వార్థం కోస ప్రయత్నాలు చేస్తున్నారని వారిని ఎవరునమ్మవద్దని నేను చట్టానికి, పోలీసు క్రమశిక్షణ కు రాజ్యాంగానికి లోబడే ఉంటానని వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.