Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల అదుపులో హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు : పౌరసత్వ వ్యతిరేక నిరసనలు

Jan 27, 2020, 1:46 PM IST

సిఎఎ వ్యతిరేక నిరసన కోసం హైదరాబాద్ యూనివర్సిటీ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెడుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గరే అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు సోషలిజం, లౌకికవాదానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా క్యాంపస్‌లో, యూనివర్సిటీ చుట్టుపక్కల భారీ భద్రతను ఏర్పాటు చేశారు.