Telangana News: తెలంగాణ భవన్లో హైదరాబాద్ టీఆర్ఎస్ నాయకుల ప్రత్యేక సమావేశం
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా స్థాయి టీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు.
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో హైదరాబాద్ జిల్లా స్థాయి టీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (trs plenary) ఈ నెల 27న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా నిర్వహించాలని అదిష్టానం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్లీనరీని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఏర్పాట్లపై చర్చించేందుకే ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, నగర మేయర్ విజయలక్ష్మితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, కార్పొరేటర్ లు, నియోజకవర్గ ఇంచార్జి లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.