Asianet News TeluguAsianet News Telugu

వణికిస్తున్న చెరువులు.. తెగడానికి సిద్ధంగా వంద జలాశయాలు...

ఎప్పుడూ నీటి కరువుతో అల్లాడే హైదరాబాద్ ను ఎక్కువైన నీళ్లే వణికిస్తున్నాయి.

ఎప్పుడూ నీటి కరువుతో అల్లాడే హైదరాబాద్ ను ఎక్కువైన నీళ్లే వణికిస్తున్నాయి. వర్షాలకు చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. కట్టలు తెగే ప్రమాదంతో కలవరపెడుతున్నాయి. నిండుకుండల్లా మారి ఎప్పుడు తొణుకుతాయో తెలియక హార్ట్ బీట్ పెంచుతున్నాయి. యేళ్లుగా కబ్జాలకు గురౌతూ, కుంచించుకుపోయిన చెరువులు ఇప్పుడు ఒళ్లు విరుచుకుంటున్నాయి. హైదరాబాద్ వాసుల మీద ఉరుముతున్నాయి. వందకు పైగా చెరువులు గరిష్ట నీటి మట్టానికి చేరి దాదాపు ఐదు లక్షల మందికి ఒళ్లు జలదరింపచేస్తున్నాయి.