కార్యకర్తలతో కాళేశ్వరం బాట పట్టిన కడియం (వీడియో)

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మన నీళ్ళని ఆంధ్రా నేతలు తరలించుకుపోతుంటే దద్దమ్మలు, సన్నాసుల్ల అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఏనాడూ కూడ కాంగ్రెస్ నేతలు పోరాటం చేయలేదన్నారు.

First Published Sep 4, 2019, 12:05 PM IST | Last Updated Sep 4, 2019, 12:05 PM IST

సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతలు మన నీళ్ళని ఆంధ్రా నేతలు తరలించుకుపోతుంటే దద్దమ్మలు, సన్నాసుల్ల అధికారంలో ఉండి పదవులు కాపాడుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఏనాడూ కూడ కాంగ్రెస్ నేతలు పోరాటం చేయలేదన్నారు.

బుధవారం నాడు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన నేతలను కాళేశ్వరం టూర్ చేపట్టారు. ఈ టూర్ కు వెళ్లే ముందు టీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి కడియం శ్రీహరి ప్రసంగించారు.ఇప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కులు కాపాడుతుంటే విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.

వేల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును నిసిగ్గుగా తినేసి జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా  మార్చి రాష్ట్రాన్ని పీక్కు తిన్నారని ఆయన విమర్శించారు.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు గెలవగానే బీజేపీ ఉలికి, ఉలికి పడుతోంది. గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడైనా బీజేపీ ఉందా అని ఆయన ప్రశ్నించారు.