వైరల్ ఫీవర్ల ఎఫెక్ట్: డాక్టర్లకు సెలవులు రద్దు (వీడియో)
సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో వైరల్ ఫీవెర్స్ వార్డ్ ను మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు శుక్రవారం నాడు ప్రారంభించారు. విష జ్వరాల బాధితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేశారు.పురుషులకు 20, మహిళలకు 20 బెడ్స్ ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో 2017లో వచ్చిన డెంగ్యూ వ్యాధితో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారని మంత్రి ఈటల రాజేందర్ గుర్తు చేశారు. ఈ ఏడాది డెంగ్యూ తీవ్రత అంతగా లేదన్నారు. మరణాల సంఖ్య కూడ తక్కువగానే ఉందన్నారు.గాంధీ ఆసుపత్రిలో 419 డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా ఆయన చెప్పారు. బాధితులకు చికిత్స అందించి పంపుతున్నట్టుగా ఆయన తెలిపారు.
డెంగ్యూ వ్యాధిగ్రస్తుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేసినందున తాము ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు.డాక్టర్లకు సెలవులు కూడ రద్దు చేశామన్నారు.లాబ్ లు, హాస్పిటల్స్ అన్ని ప్రజల సేవకోసం సిద్ధంగా ఉన్నాయని మంత్రి ఈటల తెలిపారు.స్వైన్ ప్లూ ఒక్క కేసు నమోదయ్యింది. జాగ్రత్త లు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.