లక్ష రూపాయల లోను మాఫీ ఒక మోసం.. దుదిల్ల శ్రీధర్ బాబు...


తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో స్కామ్ జరిగిందని..

First Published Aug 23, 2023, 1:35 PM IST | Last Updated Aug 23, 2023, 1:35 PM IST


తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల్లో స్కామ్ జరిగిందని.. చదువుకున్న విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు శ్రీధర్ బాబు అన్నారు.  

జగిత్యాల : జగిత్యాల జిల్లా ధర్మపురి దుదిల్ల శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ హైలెట్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలమయ్యారని జగిత్యాల జిల్లా ధర్మపురిలో దుదిల్ల శ్రీధర్ బాబు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విమర్శించారు.  లక్ష రూపాయల లోను మాఫీ ఒక మోసమని మిత్తి కూడా మాఫీ చేయాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాలు డిమాండ్లతో ఏర్పడ్డ తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి అందజేయడంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు.                     

ఎన్నికలకు ముందు ధర్మపురి దేవస్థాన అభివృద్ధికి 500 కోట్లు కేటాయిస్తాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకు వన్ పర్సెంట్ నిధులతోనైనా డెవలప్మెంట్ చేశారా అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సామాజిక సమన్యాయంతో ముందుకు వెళుతుందని సామాజిక తెలంగాణ కొరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా తెలిపారు.