నడిరోడ్డుపై తాగుబోతు మహిళ వీరంగం ... గోదావరిఖనిలో అరుదైన ఘటన
పెద్దపల్లి : ఫుల్లుగా మందుకొట్టి ఓ యువతి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నడిరోడ్డుపై హల్చల్ చేసింది.
పెద్దపల్లి : ఫుల్లుగా మందుకొట్టి ఓ యువతి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నడిరోడ్డుపై హల్చల్ చేసింది. రాత్రి కరీంనగర్ నుండి గోదావరిఖనికి ఆటోలో చేరుకున్న మహిళ డబ్బులివ్వకుండా డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడింది. దీంతో మిగతా ఆటోడ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా వారినీ దుర్భాషలాడింది. యువతి మద్యం మత్తులో వున్నట్లు గుర్తించిన ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆటో డ్రైవర్లకు నచ్చజెప్పి మహిళను తిరిగి కరీంనగర్ బస్సు ఎక్కించారు.