కేసీఆర్ జగిత్యాల పర్యటనలో అపశృతి... గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. 

Naresh Kumar | Updated : Dec 07 2022, 04:45 PM
Share this Video

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వచ్చిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేసే పరశురాంకు కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జగిత్యాలలో బందోబస్తు విధులు కేటాయించారు. ఈ క్రమంలో గత రాత్రి జగిత్యాల పోలీస్ స్టేషన్ వద్ద వుండగా ఒక్కసారిగా ఛాతీలో నొప్పిగా వుందంటూ కుప్పకూలాడు. అక్కడే వున్న పోలీసులు పరశురాంను వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించినా ఫలితం లేకుండా పోయింది. హాస్పిటల్ కు చేరేలోపే అతడి ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు తెలిపారు.  

పోలీస్ అధికారులు పరశురాం మృతివార్తను అతడి కుటుంబసభ్యులకు తెలియజేసారు. దీంతో వారు జగిత్యాలకు చేరుకుని అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించారు. విధుల్లో భాగంగా బయటకు వెళ్లిన వ్యక్తి ఇలా మృతదేహంగా తిరిగిరావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. 

Related Video