నాది తప్పైతే చెప్పుతో కొట్టండి.. నన్ను ఉరి తీయండి... కాంగ్రెస్ నేత వి హనుమంతరావు

కాంగ్రెస్ లీడర్ వి. హనుమంతరావు గత రాత్రి సిరిసిల్లలోని ఒడిశా వలస కార్మికుల కోసం మూడు బస్సులు ఏర్పాటు చేశారు.

First Published May 16, 2020, 1:27 PM IST | Last Updated May 16, 2020, 1:27 PM IST

కాంగ్రెస్ లీడర్ వి. హనుమంతరావు గత రాత్రి సిరిసిల్లలోని ఒడిశా వలస కార్మికుల కోసం మూడు బస్సులు ఏర్పాటు చేశారు. ఒక బస్సులో ఏడుగురికి మించి పంపడానికి అనుమతి లేదన్న పోలీసుల మీద జరుగు బే అంటూ నోరు పారేసుకున్నారు. విషయం తెలిసి అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. దీంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముస్తాబాద్ మండలం పోత్గల్ నుండి గత మూడు రోజుల నుండి నడుచుకుంటూ వస్తున్న ఇటుక బట్టి కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు జిల్లా కాంగ్రేస్ నాయకుల ద్వారా వి. హన్మంతరావు వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు సిరిసిల్లకు వచ్చారు. అయితే వలస కూలీలను తరలించడానికి వీల్లేదంటూ పోలీసులు, టిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మద్య  వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు హనుమంతరావును అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.