చైతన్య స్టూడెంట్ సూసైడ్... గుండెలవిసేలా ఏడుస్తూ కాలేజీ ఎదుటే తల్లి ఆందోళన

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది.

Share this Video

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ కాలేజీ క్లాస్ రూం లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకుడి ఆత్మహత్యకు కాలేజీ సిబ్బంది వేధింపులే కారణమంటూ విద్యార్థి సంఘాలు, బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రాత్రి సాత్విక్ ఆత్మహత్యను గమనించిన తోటి విద్యార్థులు కాలేజీ సిబ్బందికి సమాచారమిచ్చినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. కనీసం హాస్పిటల్ కు కూడా తరలించేందుకు ముందుకురాకపోవడంతో తోటి విద్యార్థులే బయటినుండి ఓ వాహనం తీసుకువచ్చి హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో హాస్పిటల్ కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కాలేజీ యాజమాన్యం తీరుకు నిరసనగా సాత్విక్ తల్లితో పాటు కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గుండెలవిసేలా ఏడుస్తూ ఆ తల్లి రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయింది.

Related Video