కొండపోచమ్మ సాగర్ కుడి కాల్వకు గండి.. (వీడియో)

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు గండిపడింది. 
 

Share this Video

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ నుండి యాదాద్రి జిల్లాకు నీటిని పంపే కుడికాలువకు గండిపడింది. మర్కుక్ మండలం శివార్ వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండి పడింది. దీంతో గ్రామంలోకి భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో కాలువకు గండి పడడం వల్ల ప్రమాదం తప్పిందని గ్రామస్థులు అంటున్నారు. పొలాలు, కూరగాయల తోటలు ముంపుకు గురయ్యాయి. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు అధికారులు కాలువకు నీటి విడుదల నిలిపివేశారు. ఇటీవలే కొండపోచమ్మ జలాశయం నుండి ఆలేరు నియోజకవర్గానికి నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video