బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కుక్కలతో పోల్చిన కేసీఆర్..: పల్లా సంచలనం
జనగామ : కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కుక్కలతో పోల్చినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
జనగామ : కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కుక్కలతో పోల్చినట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. జనగామ బిఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న పల్లా అక్కడి నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకోవడంపై కేసీఆర్ ను ప్రశ్నించినట్లు పల్లా తెలిపారు. 88 మంది ఎమ్మెల్యేలతో బిఆర్ఎస్ కు స్పష్టమైన ఆధిక్యం వుండగా ఇంకా ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారని సీఎంను అడిగానని అన్నారు. అందుకు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో వుంటే కుక్కల్లా మాట్లాడుతున్నారని... ఆ కుక్కులనే తమవైపు తిప్పుకుంటే పిల్లిలా మారిపోతారని సీఎం అన్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.