ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే ఆల్ ఆజ్ వెల్ మంత్రమా..!: ఎమ్మెల్సీ కవిత ఆందోళన
హైదరాబాద్ : భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ అండదండలతో లక్షల కోట్ల సంపద పెంచుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ కంపనీల షేర్లు పతనమవడమే సంక్షోభానికి నిదర్శనమన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బిఐ ఆర్థిక సంక్షోభం గురించి పట్టించుకోవడం లేదని... ఆల్ ఈజ్ వెల్(అంతా బాగానే వుంది) అనే మంత్రాన్ని జపిస్తున్నారని అన్నారు. ఇప్పటికయినా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని... జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేసి విచారణ జరిపించాలని కవిత డిమాండ్ చేసారు.
ఇక తెలంగాణ బడ్జెట్ భారత దేశానికి స్పూర్తినిచ్చేలా వుంటే మోదీ బడ్జెట్ దేశాన్ని నిరుత్సాహపరిచిందని కవిత అన్నారు. పెరిగిన సంపదను జనాభా నిష్పత్తి ప్రకారం పంచడమే ఆశయంగా కేసీఆర్ బడ్జెట్ వుందన్నారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం వైపు వెళుతుంటే ఎక్కువగా డబ్బులు గ్రామాల్లో పెట్టాలనే కామన్ ఎకనమిక్ సూత్రాన్ని తెలంగాణ పాటిచిందన్నారు. అద్భుతమైన బడ్జెట్ ఇచ్చినందుకు కేసీఆర్ ధన్యవాదాలు... ఆయనను ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.