Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ఆదేశాలతోనే అరవింద్ ఇంటిపై దాడి...: డికె. అరుణ సంచలనం

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ఖండించారు. 

First Published Nov 18, 2022, 4:50 PM IST | Last Updated Nov 18, 2022, 4:50 PM IST

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని మాజీ మంత్రి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె. అరుణ ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంతోనే ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇళ్లపై కాదు ఇండ్లలోకి వెళ్ళి దాడిచేసే పరిస్థితి తెలంగాణలో రావడం శోఛనీయమన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కొనేందుకు ప్రతివిమర్శలు చేయవచ్చే కానీ ఇలా ఇళ్లపైకి వెళ్లి కుటుంబసభ్యులకు భయబ్రాంతులకు గురిచేస్తూ దాడులకు దిగడం అత్యంత దుర్మార్గమని అన్నారు. తెలంగాణ బాషా సాంప్రదాయాన్ని మార్చిందే ఈ కేసీఆర్ మరియు ఆయన కుటుంబం... అలాంటిది వీరిపై మాట్లాడితే దాడులు చేయడం తెలంగాణ సమాజానికి ఏ సంకేతం ఇస్తున్నారంటూ అరుణ ప్రశ్నించారు.