బిఆర్ఎస్ సభకు సిద్దమవుతున్న నాందేడ్ ... ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్
మహారాష్ట్ర : తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సిద్దమయ్యారు.
మహారాష్ట్ర : తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో ముందుగా దక్షిణాదిన పార్టీని విస్తరించాలని నిర్ణయించిన బిఆర్ఎస్ అధినేత ఈ నెల (పిబ్రవరి) 5న మహారాష్ట్రలోని నాందేడ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసారు. బిఆర్ఎస్ ఏర్పాటుతర్వాత ఇతర రాష్ట్రంలో ఏర్పాటుచేస్తున్న ఈ సభను విజయవంతం చేసి కేంద్రంలోని బిజెపికి తమ సత్తా ఏంటో చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాందేడ్ బహిరంగ సభ ఏర్పాట్లను బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే బిఆర్ఎస్ ఎంపీ బిబి పాటిల్ నాందేడ్ లోనే తిష్టవేసి ఏర్పాట్లను పరిశీలిస్తుండగా ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్ రెడ్డి టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, తదితరులతో కలిసి నాందేడ్ కు చేరుకున్న మంత్రి సభా వేదిక, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు.