బిఆర్ఎస్ జెండాలతో వెళ్లి కేటీఆర్ ను అడ్డుకుని... ఏబివిపి కార్యకర్తల ఆందోళన

కరీంనగర్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

Share this Video

కరీంనగర్ : తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరీంనగర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య కేటీఆర్ కాన్వాయ్ వద్దకు చేరుకున్న ఏబివిపి కార్యకర్తలు ఆందోళనకు దిగి ఒక్కసారిగా షాకిచ్చారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం కరీంనగర్ కు చేరుకున్న కేటీఆర్ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోగానే బిఆర్ఎస్ జెండాలతో కాన్వాయ్ వద్దకు వెళ్లారు ఏబివిపి నాయకులు. పోలీసులకు కూడా ఎలాంటి అనుమానం రాకపోవడంతో కాన్వాయ్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే కేటీఆర్ కారు దగ్గరకు వెళ్లగానే ఒక్కసారిగా ఏబివిపి జెండాలతో ఆందోళన చేపట్టారు. అనుకోని పరిణామంతో అలెర్ట్ అయిన పోలీసులు ఏబివిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

Related Video