Asianet News TeluguAsianet News Telugu

గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్...ఎగ్జామ్స్ వేళ 18 మంది అమ్మాయిల అస్వస్థత

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని  గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు.

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని  గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. గురుకుల హాస్టల్లో భోజనం తర్వాత 18మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే హాస్టల్ సిబ్బంది వారిని సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవగా మిగతావారి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పరీక్షలు వుండటంతో విద్యార్థినులను హాస్టల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ గురించి తెలిసి హాస్టల్ వంటగది, కూరగాయలు, సరుకులు భద్రపరిచే గదులను వైద్యశాఖ అధికారులు పరిశీలించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలోని హాస్టల్లో విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కు గురవడంతో రాజకీయ దుమారం రేగుతోంది.