జాతీయ జెండా చేతబట్టి కేరింతలు... జరీన్ బాక్సింగ్ చూస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందడి

న్యూడిల్లీ : న్యూడిల్లీలో జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ ఆడబిడ్డ నికత్ జరీన్ స్వర్ణం పతకం సాధించింది. 

First Published Mar 27, 2023, 9:59 AM IST | Last Updated Mar 27, 2023, 10:01 AM IST

న్యూడిల్లీ : న్యూడిల్లీలో జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ ఆడబిడ్డ నికత్ జరీన్ స్వర్ణం పతకం సాధించింది. పంచులతో ప్రత్యర్థి బాక్సర్లపై విరుచుకుపడుతూ రింగ్ లో జరీన్ అదరగొడుతుంటే జాతీయ జెండా చేతబట్టి కేరింతలు కొడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆమెను ప్రోత్సహించారు. మ్యాచ్ ను స్వయంగా వీక్షించిన మంత్రి స్వర్ణం సాధించిన జరీన్ ను అభినందించారు. మంత్రితో పాటు శాట్స్ చైర్మన్ డా.ఆంజనేయ గౌడ్, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కూడా మ్యాచ్ ను స్వయంగా వీక్షించారు.