Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కార్నర్: సిఎం పీఠంపై కన్నేసిన పవన్ కల్యాణ్


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు కనిపిస్తున్నారు. 

First Published Jun 10, 2022, 11:00 AM IST | Last Updated Jun 10, 2022, 11:00 AM IST


జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసినట్లు కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ఓడించడానికి టిడిపి అధినేత చంద్రబాబుకు తనతో పొత్తు అవసరమని భావించిన పవన్ కల్యాణ్ సిఎం కుర్చీపై కన్నేశారు. చంద్రబాబును కార్నర్ చేస్తూ పొత్తులకు మూడు ప్రత్యామ్నాయాలను సూచించారు. ఆ ప్రత్యామ్నాయాలు ఇస్తూ ఈ విడత మిగతావాళ్లు త్యాగం చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు త్యాగం చేయాలని ఆయన పరోక్షంగా చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పుట్టింది. ఏపిలో ప్రతిపక్షాల పొత్తు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. దాని గురించి చూద్దాం.