రేవంత్ రెడ్డికి బిజెపి దెబ్బ: కెసిఆర్ కూ తప్పని ముప్పు

బిజెపి తెలంగాణలో పాగా వేయడానికి అవసరమైన ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. 

Share this Video

బిజెపి తెలంగాణలో పాగా వేయడానికి అవసరమైన ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల్లోని బలమైన నాయకులను ఎంచుకుని వారిని తమ పార్టీలో చేర్చుకునే వ్యూహాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరడానికి సిద్ధపడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే దారి పట్టే అవకాశాలున్నాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బలహీనపరుస్తూ కాంగ్రెస్ ను దెబ్బ తీసే వ్యూహాన్ని బిజెపి అనుసరిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కెసిార్ కు గట్టి పోటీ ఇచ్చేందకు కావాల్సిన అస్త్రశస్త్రాలను బిజెపి సిద్ధం చేసుకుంటోంది.

Related Video