లేడీ అసిస్టెంట్ పై అధికారి దాడి.. బాధితురాలికి మంత్రి అనిల్ భరోసా..

నెల్లూరులో మాస్కు పెట్టుకోమన్నందుకు దాడికి గురైన ఎ.పి. టూరిజం కాంట్రాక్టు ఉద్యోగినిని ఉషారాణిని మంత్రి అనిల్ కుమార్ పరామర్శించారు. 

First Published Jul 1, 2020, 1:17 PM IST | Last Updated Jul 1, 2020, 1:17 PM IST

నెల్లూరులో మాస్కు పెట్టుకోమన్నందుకు దాడికి గురైన ఎ.పి. టూరిజం కాంట్రాక్టు ఉద్యోగినిని ఉషారాణిని మంత్రి అనిల్ కుమార్ పరామర్శించారు. కొండాయపాలెం గేటు సమీపంలోని ఆమె ఇంటి వద్ద  మంత్రి అనిల్ కుమార్ పరామర్శించి, జరిగిన తీరును అడిగి తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నెల్లూరు పర్యాటక శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ మహిళా ఉద్యోగినిని జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భాస్కర్ రావును సస్పెండ్ చేయడంతోపాటు, పోలీసులు అరెస్ట్ చేశారు.