మహా కుంభమేళాలో యూపీ కేబినెట్ భేటీ.. యోగి సర్కార్ కీలక నిర్ణయాలు | Asianet News Telugu
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రయాగరాజ్ మహాకుంభ మేళా ప్రాంతాన్ని సందర్శించారు. త్రివేణి సంగమం ఒడ్డున యూపీ కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి యూపీకి చెందిన 54 మంది మంత్రులు హాజరవగా.. పలు కీలక పథకాలు, ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. లక్షలాది మంది భక్తులు మహాకుంభ మేళాపై విశ్వాసం నింపుతున్న తరుణంలో ఈ భేటీ నిర్వహించారు.