
52 KM Concrete Road in 6 Days: 6 రోజుల్లో 52 కిలోమీటర్లు రెండు గిన్నీస్ రికార్డులు
శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో 6 రోజుల్లో 52 కిలోమీటర్ల (156 కిలోమీటర్ల లేన్ కి.మీ.) మేర రికార్డు స్థాయిలో రహదారి నిర్మాణం జరిగింది. వానవోలు - వంకరకుంట - ఓదులపల్లె సెక్షన్‌లోని ప్యాకేజ్- 2, 3 పనుల్లో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేయడం, పేవింగ్ చేయడం ద్వారా రెండు గిన్నీస్ రికార్డులు సాధ్యమయ్యాయి.