Mahakumbh: కుంభమేళాకి 1500కోట్లు ఖర్చుపెడితే 3లక్షల కోట్ల ఆదాయం: యోగి ఆదిత్యనాథ్ | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 16, 2025, 10:00 PM IST

Maha Kumbh Mela 2025: యూపీలోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. దేశ విదేశాల నుంచి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 50 కోట్ల మంది భక్తులు కుంభమేళాను సందర్శించి పుణ్యస్నానాలు చేశారు. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద స్నాన ఘాట్లు శుభ్రంగా ఉంచేందుకు వందలాది పారిశుద్ధ్య కార్మికులతో నిత్యం పనులు చేయిస్తున్నారు. అలాంది వేలాది కార్మికులు, ఉద్యోగులు భక్తులు, సందర్శికులకు సేవలందిస్తున్నారు. మహా కుంభమేళా కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే, వందల మంది వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందారని చెప్పారు.

Read More...