చలికాలంలో ఈ ఫుడ్స్ తీసుకుంటే.... మీకు ఇక తిరుగుండదు
చలికాలంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చలికాలంలో ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. చలికాలంలో వాతావరణం మనకు అనుకూలంగా ఉండదు. తుమ్ములు, దగ్గులు, జలుబు, జ్వరం లాంటివి పిలవకున్నా వచ్చేస్తాయి. దానికి తోడు.. ప్రస్తుతం అసలే కరోనా మహమ్మారి అతలాకుతలం చేసేస్తోంది. ఇలాంటి సమయంలో.. ఆరోగ్యాన్ని పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ఉంది.
మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. మరి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి అంటే.. దానికి తగినట్లు ఆహారాలు తీసుకోవాలి.