Asianet News TeluguAsianet News Telugu

నోటీ దుర్వాసకు చెక్ పెట్టండిలా....(వీడియో)

నోటి దుర్వాస‌న ఇబ్బంది పెడుతుందా..? దాని వ‌ల్ల న‌లుగురిలో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ టిప్స్ మీ కోస‌మే. కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే నోటి దుర్వాస‌న స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..! 

First Published Sep 4, 2019, 5:47 PM IST | Last Updated Sep 4, 2019, 5:47 PM IST

నోటి దుర్వాస‌న ఇబ్బంది పెడుతుందా..? దాని వ‌ల్ల న‌లుగురిలో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ టిప్స్ మీ కోస‌మే. కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే నోటి దుర్వాస‌న స‌మ‌స్య నుంచి ఇట్టే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..! 

1. శరీరంలో తగినంత నీటి శాతం లేకపోయినా... బాడీ డీహైడ్రేట్ అయ్యి నోరు దుర్వాసన వస్తుంది. కాబట్టి.. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.అదేవిధంగా ఉదయం సమయంలో చల్లటి నీటితో  నోటిని పుక్కిలించాలి.

2. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో మౌత్ వాష్ లు లభిస్తున్నాయి. వాటితో నోటిని రోజూ పుక్కిలిస్తే.. నోటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది. తద్వారా నోటి దుర్వాసన తగ్గే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ శాతం లేని మౌత్ వాష్ లు వాడటం ఉత్తమం. లేదంటే.. నోటిని తాజాగా ఉండే మింట్ లాంటివి నవలడం కూడా  మంచిదే. 

3. నోటి దుర్వాసనను పెంచే కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి తినకుండా ఉండటం మంచిది. వాటిని తిన్న తర్వాత బ్రష్ చేసుకుంటే సరిపోతుంది కదా అని మీరు భావించవచ్చు. కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే.. ఉల్లి, వెల్లుల్లి తినడం వల్ల.. అవి రక్తంలో కలిసిపోతాయి. బ్రష్ చేసుకున్నప్పటికీ వాటి వాసన మీ నోటిలో నుంచి వచ్చేస్తుంది.