స్నేహితుల దినోత్సవం స్పెషల్ 2020 ఆగస్టు 2
ఇప్పుడు మనం వున్న బిజీ లైఫ్ లో మన భాంధావ్యాలను ,జ్ణాపకాలను నెమరువేసుకోవటానికి సమయం ఇవ్వటంలేదు.
ఇప్పుడు మనం వున్న బిజీ లైఫ్ లో మన భాంధావ్యాలను ,జ్ణాపకాలను నెమరువేసుకోవటానికి సమయం ఇవ్వటంలేదు . ప్రపంచంలో ఒకొక్క ప్రాధాన్యతను బట్టి ఒకొక రోజుగా నిర్ణయించారు. ఆధునిక టెక్నాలజీలో మనని మనం మర్చిపోయే సమాజంలో ఇలాంటి రోజులు ప్రపంచంలో మనతో పాటు ఇవి కూడా వున్నాయి అని గుర్తుచేస్తూ ఉంటాయి. అలాంటి రోజులలో స్నేహితుల దినోత్సవం ఒకటి. ఫాథర్స్ డే , మదర్స్ డే తరువాత స్నేహితుల రోజుకి ఎక్కువ ప్రాధాన్యత వుంది. అమ్మ తరువాతి స్థానం స్నేహితునికి ఉందంటారు. కుటుంబ బంధాల్ని దేవుడు ఏర్పాటు చేస్తే, స్నేహితుడిని మాత్రం మనమే ఎంచుకుంటాం.