Asianet News TeluguAsianet News Telugu

డిజిటల్ ఫ్లాట్ ఫాంలో లేడీస్ నాట్ అలౌడ్.. టికెట్ 50 రూపాయలే...

సంచలన నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’. కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తున్నారు. 

సంచలన నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’. కె.ఆర్. ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ ఇబ్బందుల గురించి చెప్పారామె. సినిమా తీసి రెండేళ్లవుతున్నా ఇంకా రిలీజ్ కు నోచుకోలేదని వాపోయారు. ఇప్పుడు దాన్ని డిజిటల్ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేయాలనుకుంటున్నామని తెలిపారు.