నాటు నాటు కి ఆస్కార్ రావడానికి అతి పెద్ద కారణం తెలుసా..?
తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమా హిస్టరీగా నిలిచింది.
తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. ఇండియన్ సినిమా హిస్టరీగా నిలిచింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ఇండియాకి రెండు ఆస్కార్లు రావడం ఓ విశేషమైతే, తెలుగు సినిమా `ఆర్‌ఆర్‌ఆర్`కి ఆస్కార్ రావడం మరో విశేషం. దాదాపు 95ఏళ్ల కల నేటితో నిజమైంది. `నాటు నాటు` పాటకిగానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కింది. ఈ పురస్కారాన్ని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ అందుకున్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు కీరవాణి. ఇది ఇండియా విజయమన్నారు. తమ రాజమౌళి, మా ఫ్యామిలీ విజయంగా తెలిపారు. కార్పెంటర్‌గా ఉన్నప్పట్నుంచి ఆస్కార్ గురించి వింటున్నానని, ఇప్పుడు ఆస్కార్ పొందానని తెలిపారు. పాట రూపంలో ఆయన తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. అందరిని అలరించారు కీరవాణి. ఇందులో చంద్రబోస్ `నమస్తే` అంటూ తెలుగులో తెలియజేయడం విశేషం.