
అన్నయ్యని నాన్న పిచ్చకొట్టుడు కొట్టేవాడు
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మెగా ఫ్యామిలీ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు కొణిదెల వారి కుటుంబంలోని మహిళలతో చిట్ చాట్ చేశారు. తమ జీవితంలో మహిళల పాత్ర, తమ విజయాల వెనుక ఉన్న వారి స్ఫూర్తి, త్యాగాలు, ప్రేమను పంచుకున్నారు. బాల్యంలో చెల్లెళ్లు, అన్నయ్య చిరంజీవి ఇంట్లో బాగా పని చేసేవారని నాగబాబు చెప్పారు. నాన్న చేతిలో చిరంజీవి బాగా దెబ్బలు తినేవాడని గుర్తు చేసుకున్నారు.