తను కండక్టర్ గా పనిచేసిన డిపోను సందర్శించిన రజనీకాంత్...సూపర్ స్టార్ అయినా ఎంత సింప్లిసిటీ...

సూపర్ స్టార్ రజనీకాంత్...తమిళనాట మాత్రమే కాదు ఇండియా మొత్తం ఈయన పేరు చెప్తే పూనకాలతో ఊగిపోతారు అంటే అతిశయోక్తి కాదు..

Share this Video

సూపర్ స్టార్ రజనీకాంత్...తమిళనాట మాత్రమే కాదు ఇండియా మొత్తం ఈయన పేరు చెప్తే పూనకాలతో ఊగిపోతారు అంటే అతిశయోక్తి కాదు..అయన స్టైల్స్ మేనరిజం కి ఎవరయినా విజిల్స్ వెయ్యాలిసిందే..ఫాన్స్ కావాల్సిందే..70 ఏళ్ళ వయసులో కూడా జైలర్ లాంటి సూపర్ హిట్ తో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఆయన నిజజీవితం లో మాత్రం ఎంత సింపుల్ గా ఉంటారో అందరికి తెలిసిందే...ఏ రోజూ ఆయన తన మూలాల్ని మర్చిపోకుండా ఆ పాత స్నేహితులతో అదే బంధాన్ని కొనసాగితుతూ ఉంటారు. సినిమాల్లోకి రాకముందు ఆయన బస్సు కండెక్టరుగా పనిచేసిన విషయం తెలిసిందే..కర్ణాటకలో జయనగర్ బీఎంటీసీ డిపోలో ఆయన పనిచేసేవారు..ఈ రోజు ( ఆగష్టు 29 ) న ఆకస్మికం గా ఆ డిపోను సందర్శించి అందరిని ఆశ్చర్యపరిచారు. సడెన్ గా రజనీకాంత్ ను అక్కడ చూసిన సిబ్బంది ఆనందానికి హద్దే లేదు..వారితో సెల్ఫీ లు తీసుకుంటూ కాసేపు ముచ్చటించిన రజనీ ఆ పాత రోజులను గుర్తు చేసుకున్నారు..అనంతరం చామరాజ్‌పేటలోని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠాన్ని సందర్శించారు...

Related Video