కూతురితో కలిసి శ్రీవారి సన్నిధిలో షారుఖ్... తిరుమలలో లేడీ సూపర్ స్టార్ సందడి...

తిరుమల : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార తిరుమలలో సందడి చేసారు.

Share this Video

తిరుమల : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార తిరుమలలో సందడి చేసారు. ఈ శుక్రవారం(సెప్టెంబర్ 7) వీరు నటించిన పాన్ ఇండియా మూవీ 'జవాన్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ తిరుమలకు విచ్చేసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తండ్రి షారుఖ్ వెంట కూతురు సుహాన ఖాన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

ఇక రీసెంట్ గా షారుఖ్(Shah Rukh Khan) ఖాన్ జమ్ములోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. అర్ధరాత్రి ఆలయానికి చేరుకున్న షారుఖ్ వైష్ణోదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంతమందితో కలిసి ఆలయ ప్రాంగణంలో షారుఖ్‌ నడిచి వెళ్లున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా తిరుమల ఆలయంలో హీరోయిన్ నయనతారతో కలిసి కనిపించారు షారుఖ్. 

Related Video