Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా మెంటర్ గా ధోని నియామకం వెనకున్న అసలు కారణం...

Sep 27, 2021, 1:58 PM IST

మిస్టర్ కూల్ గా జట్టు సహచరుల మన్ననలు అందుకున్న ధోని.. ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకుడిగా ఉన్నా అది ముగిసిన వెంటనే ప్రారంభం కాబోయే టీ 20 ప్రపంచకప్ కు భారత జట్టుకు సలహాదారుడిగా నియమితుడయ్యాడు. ధోని నియామకం సరైందే అని కొందరు, అవసరం లేదని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే స్వదేశంతో పాటు విదేశాల్లోనూ వన్డేలు, టెస్టు సిరీస్ లను నెగ్గుతున్న విరాట్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో ధోని నియామకం భారత్ కు కలిసొస్తుందా..? లేదా..? అనేదానిపై ఒక లుక్కేద్దాం..!