సిడ్నీలో టీమిండియా సూపర్ డ్రా... గాయాలతోనూ గర్జించిన భారత్...

407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా? 

First Published Jan 11, 2021, 4:38 PM IST | Last Updated Jan 11, 2021, 4:38 PM IST

407 పరుగుల భారీ లక్ష్యం... భారత జట్టు 200 పరుగులైనా కొడుతుందా? నిప్పులు చెరిగే ఆస్ట్రేలియా బౌలర్ల ముందు ఆలౌట్ కాకుండా నిలబడుతుందా? అనే అనుమానాలు? కానీ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ టీమిండియా చరిత్రలో నిలిచిపోయే టెస్టు ఇన్నింగ్స్ ఆడింది. అసలు సిసలైన క్రికెట్ మజాని అభిమానులకు పంచింది. భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, పూజారా, రిషబ్ పంత్ అవుట్ అయినా...  హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 40 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేసి, అద్భుతం చేశారు... మిగిలిన ఐదు వికెట్లు తీసి రెండో టెస్టులో విజయం సాధించాలనుకున్న ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లారు. హనుమ విహారికి గాయం కావడం, రవీంద్ర జడేజా గాయపడి, బ్యాటింగ్‌కి రాలేని పరిస్థితిలో ఉండడం లేకపోతే సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకి షాక్ తగిలేదే...