ప్లే ఆఫ్స్ రేసు: ఏ జెట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంటోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తుది అంకానికి చేరుకుంటోంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచులు మరో వారంలో ముగియనున్నాయి. అయినా, ఐపీఎల్ 2020 టాప్-4, ఫ్లే ఆఫ్స్ చేరుకునే జట్లపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. 8 ప్రాంఛైజీలలో చెన్నై సూపర్‌కింగ్స్ మాత్రమే ప్లే ఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా నిష్కమించింది. మిగిలిన ఎనిమిది ప్రాంఛైజీలు టాప్-4లో చోటు సాధించగలే స్థితిలోనే ఉన్నాయి. ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌లు ప్లే ఆఫ్స్‌కు ఒక్క విజయం దూరంలో నిలిచాయి. కోల్‌కత నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్ల ఆఫ్స్ అవకాశాలు పూర్తిగా ఆ జట్ల ప్రదర్శనపైనే ఆధారపడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఇతర జట్ల ప్రదర్శన సహా ఇతర సమీకరణాలపై ఆశలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచాయి. నవంబర్ 5 నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. టాప్-4లో నిలువగల జట్లేవే చూద్దాం.