పార్టీని నమ్ముకుని నష్టపోయా... ఇకపై నా సత్తా చూపిస్తా..: వైసిపికి ఎస్సీ నాయకుడి హెచ్చరిక
గుంటూరు: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో రూ.30 లక్షలు నష్టపోయానంటూ గుంటూరు జిల్లా అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందిన ఎస్సీ నాయకుడు చిన్న ఆవేదన వ్యక్తం చేసాడు. పార్టీ కోసం 10సంవత్సరాలు కష్టపడినప్పటికి ప్రజా ప్రతినిధులు, కింది స్థాయి కార్యకర్తలని పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. తన ఆవేదనంతా వ్యక్తపరుస్తూ ఓ సెల్పీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ గా మారింది. మూడు రాజధానులకి సైతం మద్దతుగా దీక్షలు, ర్యాలీలు చేసినా ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్నవారి అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపుతానని చిన్నా తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది