ఏలూరులో దారుణం... అధికార వైసిపి ఎంపిటిసి సెల్ఫీ సూసైడ్ కలకలం
ఏలూరు : సొంత పార్టీ నాయకులే తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ నెల్లూరు జిల్లాలో అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏలూరు : సొంత పార్టీ నాయకులే తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ నెల్లూరు జిల్లాలో అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరించిన ఎంపిటిసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు రూరల్ మండలం గుడివాకులంక గ్రామ ఎంపీటీసీగా వైసిపి నాయకుడు మోరు సాల్మన్ రాజు కొనసాగుతున్నాడు. అయితే తన రాజకీయ ఎదుగుదల ఇష్టంలేని కొందరు వైసిపి నాయకులు తనపై అక్రమకేసులు పెట్టి వేధించడం ప్రారంభించారని ఎంపిటిసి సాల్మన్ తెలిపాడు. ఇక వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని... ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నచ్చడంలేదని పేర్కొన్నాడు. ఇలా గుడివాకులంక గ్రామ శివారులోని చేపలచెరువు వద్ద కారులోనే సెల్పీ వీడియో తీసుకుంటూ పురుగులమందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు ఎంపిటిసి సాల్మర్ రాజు.