Asianet News TeluguAsianet News Telugu

రాసిపెట్టుకొండి... మళ్లీ నెల్లూరు నుండే నేనే పోటీ చేస్తా..: మాజీ మంత్రి అనిల్

నెల్లూరు : తనకు వైసిపి టికెట్ దక్కదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. 

నెల్లూరు : తనకు వైసిపి టికెట్ దక్కదంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ శునకానందం పొందుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కానీ అనిల్ అనే వ్యక్తి నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తున్నాడు... రాసిపుట్టుకోండి అంటూ కౌంటరిచ్చారు. తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్ప ఏ తురుంఖాన్ కు  తలవంచనని... బ్రతికినా చచ్చినా సింహం లాగే తలవంచకుండా బ్రతుకుతానని అన్నారు. జగనన్న గీసిన గీత దాటను... కానీ 2024 లో మళ్ళీ నెల్లూరు నుండే పోటీ చేస్తానని అనిల్ యాదవ్ స్పష్టం చేసారు.