Asianet News TeluguAsianet News Telugu

స్వయంగా నల్లా నీళ్లు పట్టుకుని తాగి... వైసిపి ఎమ్మెల్యే ఆర్కే సింప్లిసిటీ


మంగళగిరి : అధికార వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు.

మంగళగిరి : అధికార వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ఇవాళ ఉదయం ఉండవల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆర్కే ఇంటింటికి తిరుగుతూ కృష్ణా త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. స్వయంగా ఎమ్మెల్యేనే నల్లా నీటిని తాగి మరీ స్వచ్చతను పరిశీలించారు. ఇలా కృష్ణా తాగునీటి సరఫరా గురించి ప్రజలకు వివరించి... ప్రెజర్ శాండ్ ఫిల్టర్ ల ద్వారా శుద్దిచేస్తున్న ఈ నీటినే తాగాలని ఎమ్మెల్యే సూచించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతే... ఇకపై ఉండవల్లి గ్రామంలో తాగునీటి కష్టాలు ఉండవన్నారు. ప్రతి ఇంటికి కృష్ణా నది నీళ్లు అందిస్తామని... నెల రోజుల్లో ఉండవల్లి గ్రామంలో పూర్తిస్థాయి తాగు నీటి సరఫరా జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ పాలకులు ఇదే నది తీరాన అక్రమంగా నివసించినప్పటికీ ఇటువంటి ఆలోచన చేయకపోవడం బాధాకరమంటూ మాజీ సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే విమర్శలు సంధించారు.

Video Top Stories