ఆ వీడియోలో మేమేమీ తప్పుగా మాట్లాడలేదు..: సీఎం జగన్ సైకో వ్యాఖ్యలపై దుట్టా

గన్నవరం : వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ సైకో అంటూ సొంత పార్టీ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Share this Video

గన్నవరం : వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓ సైకో అంటూ సొంత పార్టీ నేతలు దుట్టా రామచంద్రారావు, యార్లగడ్డ వెంకట్రావు అనుచిత వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలాగే మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లపై కూడా వీరు తిడుతున్నట్లుగా వీడియోలో వుంది. ఈ వీడియోపై రాజకీయ దుమారం రేగుతుండటంతో తాజాగా తమ మాటలపై దుట్టా వివరణ ఇచ్చారు. ఓ గుడి ఓపెనింగ్ నిమిత్తం తాను, యార్లగడ్డ వెంకట్రావు కలుసుకున్నామని... ఈ సమయంలోనే సరదాగా మాట్లాడుతుండగా ఎవరో వీడియో తీసారని దుట్టా అన్నారు. అయితే ఈ వీడియోను ప్రసారం చేస్తూ తాము ముఖ్యమంత్రి జగన్ ను సైకో అన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయని... కానీ తమ ఇద్దరిలో ఎవ్వరమూ అలా అనలేదన్నారు. వైఎస్సార్ నుండి ఇప్పుడు జగన్ వరకు తమకు వైఎస్ కుటుంబంతో మంచి సంబంధాలున్నాయని... చచ్చేవరకు మా కుటుంబం జగన్ తోనే వుంటుందన్నారు. అలా అభిమానించే జగన్ తిట్టే మనస్తత్వం తమది కాదని అన్నారు. కానీ బయటకు వచ్చిన వీడియోలో అనకూడని మాటలు ఏమీ లేవంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు దుట్టా రామచంద్రరావు. 

Related Video