Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ పాదయాత్రలో జూ.ఎన్టీఆర్ జెండాలు... నూజివీడులో యువకుల హల్ చల్...

ఏలూరు : తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. 

First Published Aug 25, 2023, 3:15 PM IST | Last Updated Aug 25, 2023, 3:15 PM IST

ఏలూరు : తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో ముగిసి నూజివీడు నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన జెండాలను పట్టుకుని బైక్ ర్యాలీ నిర్వహించారు. యువకుల బైక్ లపై టిడిపి గుర్తు, తలకు పసుపు కండువా వున్నప్పటికీ చేతిలో మాత్రం మీసం మెలేస్తున్న జూ.ఎన్టీఆర్ ఫోటోతో కూడిన జెండాలున్నాయి. లోకేష్ పాదయాత్ర వేళ ఈ బైక్ ర్యాలీ రాజకీయ చర్చకు దారితీసింది.